అన్నమయ్య: రాయచోటి మండలంలో నిన్న ఉపాధ్యాయ ఎన్టీఏ (NTA) నూతన పాలకవర్గం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గోరంట్ల అమర్నాథ్, అధ్యక్షునిగా గోవిందా నాగరాజా, ఆర్థిక కార్యదర్శిగా కదిరుల్ల ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్టీఏ అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, జిల్లా నాయకులు కొండూరు మురళీమోహన్ రాజు, జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.