సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వి. రత్న “ప్రజా ఫిర్యాదుల వేదిక” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 60 పిటిషన్లలో భూ సమస్యలు, కుటుంబ కలహాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు.