KRNL: వర్షాల కారణంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ప్రవేశానికి సంబంధించి మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఉత్పత్తులను యార్డులోకి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే వాహనాలను నిలిపివేస్తామని తెలిపారు. ఉల్లిగడ్డలను పొలంలోనే గ్రేడింగ్ చేసి, మురుగు లేకుండా తీసుకువస్తే మంచి ధర లభిస్తుందని ఆమె సూచించారు.