KRNL: మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి గోపురానికి స్థానిక గ్రామస్థులు సత్యనారాయణ రెడ్డి, రాఘవేనమ్మ దంపతులు ఇవాళ రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పనులు జరుగుతున్నాయని, గ్రామ ప్రజలు కోరిక మేరకు గుడి గోపురానికి ఈ విరాళం ఇచ్చినట్లు వారు తెలిపారు.