KDP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా పేర్కొన్నారు. శుక్రవారం బద్వేల్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎక్కువ సంవత్సరాలు ప్రధానిగా పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.