VSP: స్టీల్‌ప్లాంట్‌లో కీలక విభాగమైన RMHPలో పర్యవేక్షణ లోపం కారణంగా తరచూ కోకింగ్‌కోల్ నిల్వల్లో మంటలు చెలరేగుతున్నాయి. బాయిలర్‌కు అవసరమైన కోల్ నిల్వల్లో ఎయిర్ గ్యాప్స్ వల్ల ఆక్సిజన్‌తో కలిసి మంటలు చెలరేగడం సహజమే. కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు, కన్వేయర్ల నిర్వహణ లోపం, అధికారుల బదిలీల వంటి పరిణామాలతో ఇలాంటివి జరుగుతున్నాయని కార్మిక సంఘాలు అంటున్నాయి.