ATP: కూడేరు మండల కేంద్రంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చెరువుల్లో 40 శాతం సబ్సిడీతో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. శనివారం పీఏబీఆర్ డ్యాం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఉచితంగా మత్సకార సహకార సంఘాలకు చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు.