NTR: రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం విజయవాడ నిడమానూరు హైవే వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించి, మానవత్వాన్ని చాటుకున్నారు. తన కాన్వాయ్‌ను ఆపి, ప్రమాద బాధితుడిని తన సొంత వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు.