SKLM: మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మెలియాపుట్టి మండలంలో రూ.8 కోట్ల నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2.15 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.