NLG: నల్లగొండ పట్టణం సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నది. ఈ మేరకు నల్గొండ విద్యుత్ ఏడీఈ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడతుందని ఆయన తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.