TPT: కోట మండలం కోట ఆనకట్ట చల్ల కాలువను గూడూరు ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. కట్ట కింద సుమారు 7వేల ఎకరాల ఆయకట్టు సాగులో ఉందన్నారు. ఇందులో పూడికతీతకు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న సీజన్లో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.