నెల్లూరులోని 3, 10, 39, 48 డివిజన్లలో మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు అధికారులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలపై తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు పాలన మరింత చేరువ కావడమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఆయన తెలిపారు.