KDP: కడప మున్సిపల్ సమావేశం పోలీసుల బందోబస్తు మధ్య మొదలైంది. ఇందులో వేదికపై ఎమ్మెల్యేల కుర్చీలు తీసేసి, మేయర్‌కు మాత్రమే కుర్చీ ఏర్పాటు చేయడంతో పాటు, ఎమ్మెల్యే మాధవి ప్రసంగాన్ని కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో సమావేశంలో రచ్చ మొదలైంది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మాధవీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.