GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సావిత్రీబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సావిత్రీబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకమని నేతలు పేర్కొన్నారు.