GNTR: గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద పట్టాభిపురం పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. వాహనం నడుపుతూ మద్యం తాగిన వారికి సంబంధించిన బైక్ను సీజ్ చేశారు.