చిత్తూరు: టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గిరి ఆధ్వర్యంలో NCP కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్టేట్ లీడర్ కన్సల్టెంట్ శివకుమార్, టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరమన్నారు. అనంతరం గాంధీ రోడ్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు పొగాకు వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.