నెల్లూరులోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం మాతా శిశు మరణాల సబ్ కమిటీ సమీక్షా సమావేశాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య నిర్వహించారు. 2024 గత అక్టోబర్ నెలలలో సంబవించిన 5 శిశు మరణాలకుగల కారణాలు మరియు లోపాలు గురించి క్షుణ్ణముగా సమీక్షించారు. ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి త్వరితగతిన నమోదు చేయాలని, అన్నీ రకాల పరీక్షలు తప్పని సరిగా చేయాలని ఆదేశించారు.