ELR: వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రోషన్ గురువారం పలు సూచనలు జారీ చేశారు. అవసరమైతేనే తప్ప బయటకు రావాలని, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే, విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు.