KRNL: చిప్పగిరి మండలంలోని కాజీపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రామాంజనేయులు మృతి చెందారు. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వైకుంఠం ప్రసాద్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.