ELR: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద క్రమంగా పెరుగుతోంది. వేలేరుపాడు మండలంలోని యడవల్లి వద్ద ఎద్దువాగు వంతెన నీట మునిగింది. దీంతో యడవల్లి, కట్కూరు, సిద్ధారం, కొయిదాతో సహా 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం DSP వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఆధీనంలో మరబోటును ఏర్పాటు చేశారు.