అనకాపల్లి: పీజీఆర్ఎస్లో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి సత్వరం పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చారు.