NLR: ముత్తుకూరు మండలం మామిడిపూడిలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం అంకయ్య అర్జీ సమర్పించారు. గత 70ఏళ్ల నుంచి హరిజన, గిరిజన, అరుంధతియ నిరుపేద కులాలవారు మామిడిపూడి రెవెన్యూలో సాగు చేస్తున్న 118-44సెంట్ల భూములను ఇటీవల రీ-సర్వేలో పోరంబోకు భూములుగా రికార్డులలో నమోదు చేశారన్నారు.