CTR: భాకరాపేట నుంచి ఎలమంద రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం పరిశీలించారు. రోడ్డు పనులలో నాణ్యత పాటించి సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు, కాంట్రాక్టర్కు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.