కృష్ణా: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదిలోకి 5లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని గురువారం ఉదయం విడుదల చేయటంతో నాగాయలంక రేవుకు చేరింది. శ్రీరామపాద క్షేత్రం ఘాట్‌లో ఉన్న కృష్ణవేణి విగ్రహానికి వరద నీరు మోకాలు వరకు చేరింది. వరద నీటిని చూసేందుకు సందర్శకులు ఘాట్‌కు వస్తుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.