ఏలూరు: నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా రూపొందిద్దామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు నాలుగో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వద్దు.. జ్యూట్ బ్యాగులు ముద్దు అంటూ ప్రచారం చేశారు.