TG: చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేశామో లెక్కలతో సహా ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రుణమాఫీ చేసి చూపించామని చెప్పారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ మేలు చేశామని వెల్లడించారు.