పల్నాడు: వినుకొండ BSP కార్యాలయంలో దాదా సాహెబ్ కాన్షీరామ్ 91వ జయంతి సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిన బహుజన సమాజ్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు బాసటగా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.