AP: మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరిలో చేతి సంచుల ఏటీఎంను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడాదిలోగా స్వచ్ఛాంధ్ర మంగళగిరి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో మంగళగిరి అగ్రగామిగా ఉండాలని అధికారులకు సూచించారు.