PPM: వీరఘట్టం, పాలకొండ, బూర్జ మండలాలకు సాగునీరు, త్రాగునీరు అందించే తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు పరిధిలో ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులపై పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం అసెంబ్లీ జీరో హవర్లో ప్రస్తావించారు. గత టీడీపీ హయంలో 23% పనులు పూర్తయినప్పటికీ అనంతరం వచ్చిన వైసీపీ ఎడమ కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయలేదని అన్నారు.