VZM: EPS పెన్షనర్లకు కనీసం 9 వేలు ఇవ్వాలని CITU విజయనగరం జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు బొబ్బిలి CITU కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కనీస పెన్షన్ కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఈ నేపథ్యంలో ఈనెల 11న విజయనగరం PF కార్యాలయం వద్ద ధర్నా చేపట్టలని నిర్ణయించామన్నారు.