ATP: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని రెవెన్యూ భవనంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 467 అర్జీలను స్వీకరించారు. గడువు ముగిసేలోగా సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడా అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు.