E.G: నూతన సంవత్సర వేడుకల వేళ గిగ్ డెలివరీ కార్మికుల ఒక్కరోజు సమ్మెకు IFTU మద్దతు తెలిపింది. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని రద్దు చేయాలని, వేతనాల్లో పారదర్శకత కల్పించాలని జిల్లా కార్యదర్శి బుద్ధ వెంకట్రావు డిమాండ్ చేశారు. అకారణంగా ఐడీలు బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు.కార్మికుల ప్రాణాలతో ఆడుకునే నిబంధనలను తొలగించాలని ఆయన కోరారు.