SKLM: ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమదాలవలస YSR పార్టీ సమన్వయకర్తగా రవికుమార్ ఎంపిక చేయడం పట్ల రవికుమార్‌తో పాటు ఆమదాలవలస నాలుగు మండలాల నాయకులు మాజీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. YSR పార్టీ బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.