TPT: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా, వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు గూడూరులో ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీల బాదుడు ప్రజల నెత్తిన రుద్దడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.