CTR: గుడిపాల మండలం కొత్తపల్లి వద్ద చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైవేపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన నేసన్గా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఘటనపై పోలీసులు కేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.