VSP: ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ సీపీఐకే సాధ్యమని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ సెక్టార్-1 షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శనివారం పార్టీ శత వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సీపీఐ పోరాటం చేస్తుందన్నారు.