ATP: జిల్లాలో సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రేపు ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయంలో హాజరుకావాలని ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా నుంచి సివిల్ విభాగానికి 278 మంది, ఏపీఎస్పీ విభాగానికి 210 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, మూడు జిరాక్స్ సెట్లు, నాలుగు ఫొటోలు తీసుకురావాలని అన్నారు.