VSP: జీవీఎంసీ పరిధిలోని పలు వార్డుల్లో జనవరి 5, 6వ తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు పల్లంరాజు శనివారం తెలిపారు. ఆరిలోవ, తాటిచెట్లపాలెం, ఎండాడ, మధురవాడ, పాత వెంకోజిపాలెం, దశపల్లా హిల్స్, సాలిపేట, అల్లిపురం తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుందన్నారు.