W.G: జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం శనివారం పాలకొల్లు ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ముద్దాడ గణేశ్ భవాని ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పాలకొల్లు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా పాశర్ల మాధవనారాయణరావును నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రేవు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.