VSP: విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నవంబర్ 1న రాటోత్సవ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఆలయ ఈవో కే. శోభారాణి గురువారం ఆహ్వానించారు. మార్గశిర మాస మహోత్సవాల నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రాటోత్సవం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.