ELR: జిల్లాలో 13,650 హెక్టార్లలో విస్తరించిన కొబ్బరి తోటలపై రాబోయే మూడు నెలల్లో తెల్లదోమ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ హెచ్చరించారు. దీని నివారణకు పవర్ స్ప్రేయర్‌తో నీళ్లు, వేపనూనె, ఈసారియా ఫ్యూమోసోరోజియా పిచికారీ చేయాలని సూచించారు. పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు, మిత్రకీటకాలను సంరక్షించుకోవచ్చని తెలిపారు.