PPM: అక్రమంగా పనులు చేపడుతున్న బడి దేవరకొండ మైనింగ్ తవ్వకాలను వెంటనే ఆపాలని బడిదేవరకొండ పరిరక్షణ కమిటీ సభ్యులు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తవ్వకాల్లో ప్రజాప్రతినిధుల ప్రమేయంతో పనులు చేపడుతున్నారని, ఈ పనుల వలన గిరిజన ప్రజలకు, పార్వతీపురం మండలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.