KRNL: కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట రహదారి పనులు రూ. 2 కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు ఆర్అండ్బీ ఏఈ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. కొలిమిగుండ్ల మండల కేంద్రం నుంచి పెట్నికోట సమీపం వరకు రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు పనులు ప్రారంభించినట్లు తెలిపారు.