AKP: కోటవురట్ల తాలూకా యూనిట్ ఎన్జీవో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా కేవీ రమణ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా కే.ఎస్.వీ. ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎల్ శేషు, ఏఎస్ మణికంఠ, ఎస్.కె మదీనా, కార్యదర్శిగా సీహెచ్ రాజగోపాల్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.