ATP: కంబదూరు(మం) గూళ్యంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందు–సునీత దంపతుల కుమారుడు చరణ్ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఘటనతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.