KRNL: ఆదోనిలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఐ మల్లప్ప తెలిపారు. హెల్మెట్ వినియోగం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, డ్రంకెన్ డ్రైవ్ నిషేధంపై పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.