శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు హాజరుకావాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.