ELR: అడ్మినిస్ట్రేషన్ పరంగా అనుకూలంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలోనే గణపవరం మండలంను ఉంచాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉంగుటూరు ఎంఎల్ ఏ పత్సమట్ల ధర్మరాజును ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ వినతి పత్రం అందజేశారు. అలాగే పోలీస్ శాఖను పశ్చిమ గోదావరిలో కలపాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నం చిననాగేశ్వరావు, మేడిశెట్టి పెంటారావు పాల్గొన్నారు.