NLR: పండించిన ధాన్యాన్ని ఆరబోసేందుకు కూడా కనీసం పట్టలు లేవని కోవూరు మండలం పాటూరులో రైతులు సీఎం చంద్రబాబు, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ టీడీపీ నాయకులు, రైతు లక్ష్మీశెట్టి శీనయ్య తన ఆవేదనను మీడియా ఎదుట వెల్లడించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు బాగుపడిన పాపాన పోలేదని మండిపడ్డారు.