KKD: తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మంగళవారం టీడీపీలో చేరాయి. దళిత నాయకులు పులుగు వీరబాబు, దడాల సింహాచలం, నొక్కి సూరిబాబుల ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరగా, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాభివృద్ధి, ప్రజాసేవను లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.